చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలి

జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి  కేతావత్ లలిత కుమారి
వికారాబాద్ రూరల్ జూన్ 23 జనంసాక్షి : అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి రోజు చిన్నారులను పంపించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి  కేతావత్ లలిత కుమారి  తల్లిదండ్రులను కోరారు . గురువారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ ఆదికారిణి లలిత కుమారి మాట్లాడుతూ ప్రతి కేంద్రంలో ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ ద్వారా అందిస్తున్న సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలకు సమతుల్య నాణ్యమైన బలవర్ధకమైన  ఆహారాన్ని అందించడంతోపాటు నాణ్యమైన విద్యను కూడా అందిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పిల్లలను ఇంటి వద్ద ఉంచటం కన్నా , అంగన్వాడీ కేంద్రానికి పంపించటం ఉత్తమమని పేర్కొన్నారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలు వయసుకు తగ్గ మరియు వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేరా అనే విషయంలో రెగ్యులర్గా పిల్లల్ని కొలతలు తీయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లల్ని అంగన్వాడి  టీచర్ల ద్వారా  తమ గ్రామ పరిధిలోని ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ చేయడం జరుగుతుందని చెప్పారు. అయితే ఈ రోజు మన గ్రామ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో  రెండున్నర సంవ త్సరాల లోపు ఉన్న పిల్లలకు సామూహిక అక్ష రాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి పరిణామమని కొనియాడారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలకు ప్రతిరోజు అనుబంధ పోషకాహారం , అన్నం , పప్పు గుడ్డుతో మద్యాహ్న భోజనం ఇస్తున్నామని చెప్పారు . గర్భిణీలకు  బాలింతలకు కూడా అంగన్వాడి కేంద్రం ద్వారా ఇచ్చే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా అందించే సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వికారాబాద్ ప్రాజెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాల్లో పేరును నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. అంగన్వాడీ పిల్లలకు వచ్చే పిల్లలకు నాణ్యమైన భోజనంతో పాటు ఆటా పాటలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంజయ్య, గ్రామ ఉపసర్పంచ్, హెల్త్ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు హాజరయ్యారు.

తాజావార్తలు