చిరంజీవికి కరోనా పాజిటివ్
– తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా వెల్లడి
హైదరాబాద్,నవంబరు 9(జనంసాక్షి):తాను కరోనా బారిన పడ్డానని కథానాయకుడు చిరంజీవి వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించే తరుణంలో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. ఈమేరకు ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు.”ఆచార్య’ షూటింగ్ ప్రారంభించాలని కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. వెంటనే ¬మ్ క్వారంటైన్‌లో ఉన్నాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరినీ టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని విూకు తెలియజేస్తాను’ అని చిరు పేర్కొన్నారు.చిరంజీవికి కరోనా వచ్చిందని తెలియడంతో మెగాస్టార్ కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తూ సోషల్‌విూడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అభిమానులు సైతం ఆయన ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు, చిరంజీవి తమ్ముడు నాగబాబు ఇటీవల కరోనాని జయించిన విషయం తెలిసిందే.
చిరు.. త్వరగా కోలుకోండి
తాను కరోనా బారిన పడినట్లు అగ్రకథానాయకుడు చిరంజీవి అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చిరు వెల్లడించారు. దీంతో ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌విూడియా వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.’నీకోసం కాకుండా ఎదుటివారి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం.. నీ చుట్టూ ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నావు. నీ గొప్ప ఆలోచనలతో నువ్వు ఎంతోమందికి స్ఫూర్తి. అన్నయ్య నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ – నాగబాబు’చిరు సర్. విూరు కరోనాని జయించి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ – నిఖిల్ ‘విూరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి.’ – రవితేజ ‘చిరంజీవి సర్.. విూరు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యవంతులుగా తిరిగి రండి. హనుమంతుడి ఆశీస్సులు ఎప్పటికీ విూతో ఉంటాయి. మిమ్మల్ని మేము ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ – దేవిశ్రీ ప్రసాద్ ‘విూరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను సర్’ – నితిన్ ‘మామయ్య.. విూరు త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తున్నాను’ – ఉపాసన’త్వరలో విూరు యథావిధిగా షూటింగులో పాల్గొంటారు.. కోట్లాదిమంది అభిమానుల ప్రార్థనలు విూతో ఉన్నాయి సర్’ – రామజోగయ్య శాస్త్రి