చెన్నారావుపేట ఎస్ ఐ మహేందర్ కు భారత రాజ్యాంగ పిటికను బహుకరించిన షెడ్యూల్ క్యాస్ట్ నాయకులు నర్మెట యాదగిరి, సాధు నర్సింగరావు

జనం సాక్షి, చెన్నరావు పేట

మండల కేంద్రంలోని చెన్నారావుపేట మండల పోలీసు స్టేషన్ లోని ఎస్ ఐ తోట మహేందర్ కి శుక్రవారం భారత రాజ్యాంగ పిటికను షెడ్యూల్ క్యాస్ట్ నాయకులు నర్మెట యాదగిరి, సాధు నర్సింగరావు ఎస్ ఐ తోట మహేందర్ కు బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలకు పరిపాలన అందించాలని కోరారు. భారత దేశంలోని ప్రతి పౌరుడు భారత రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలపై అవగాహన కల్గి ఉండాలని, అలాగే చట్టాల గురించి తెలుకోవాలని వారు కోరారు.