చెప్తే చెల్లిస్తా ; ఎన్నికల్లో పోటీ చేయాలి : బెయిల్‌కోసం గాలి

హైదరాబాద్‌ : కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి బెయిల్‌ కోసం కోత్త పద్దతులు ఎంచుకున్నారు. ఓబులాపురం మైనింగ్‌ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తూ వచ్చిన గాలి బుధవారం తాను ఎన్నికల్లో పోటీ చేయాలని తనకు బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరారు. ఓఎంసిలో ఎంత నష్టం జరిగింతో చెబితే తాను దానిని చెల్లిస్తానని తనకు బెయిల్‌ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఓఎంసికేసులో సిబిఐ చెబెతెన్నట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏమైనా వాటిల్లినట్లు తేలితే అ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి తాను సిద్దంగా ఉన్నానని గాలి చెప్పారు. మరో ఐదు నెలల్లో జరగనున్న బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. బెయిల్‌ కోరుతూ గాలి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నాంపల్లి సిబిఐ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి.తన న్యాయవాది విజయసేనరెడ్డి ద్వారా గాలి తరపున వాదనలు వినిపించారు. తాము అరెస్టు అయ్యే ముందు వరకు మంత్రినని, ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నానని, ప్రజా ప్రతినిధిగా తాను కర్ణాటక ఎన్నికల్లో పాల్గోనాల్సి ఉందని చెప్పారు. ఖజానాకు నష్టం వాటిల్లిందని సిబిఐ అరోపిస్తోందని, ఇది నిరూపణ అయితే చెల్లిస్తానని స్పష్టం చేశారు.ఒఎంసి కేసులో గాలికి మైనింగ్‌ లీజు ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని సిబిఐ అరోపించిందని, అదే నిజమని భావించినా అ కేసులో శ్రీలక్ష్మిని, రాజగోపాల్‌ను మాత్రమే అరెస్టు చేయడం ఏం న్యాయమని డిఫిన్స్‌ న్యాయవాది ప్రశ్నించాడు.ఓఎంసికి లీజు మంజూరు జేయడంలో అయా శాఖల అధికారులు చాలా మంది ఫైల్స్‌ చూస్తారని అన్నారు,వారిని అరెస్టు చేయాలని తాము అడగడం లేదని అయితే సిబిఐ దర్యాప్తు ఎలా సాగుతుందనే విషయాన్ని చెప్పేందుకే దీనిని కోర్టు దృష్టికి తెస్తున్నామన్నారు. వాస్తవాల్ని పరిశీలించి నిందుతుడికి బెయిల్‌ ఇవ్వాలని కోరారు. సిబిఐ న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో న్యాయమూర్తి బెయిల్‌ కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు.