*చెరువుల క్రింద జోరందుకున్న వరినాట్లు
*కూలీలు దొరకక వ్యవసాయదారులకు ఇబ్బందులు
16 జూలై (జనంసాక్షి)ఎడతెరిపి లేకుండ మొన్న కురిసిన వానలకు మండలంలోని అన్ని గ్రామాల చెరువులు కుంటలు నిండి ఉన్నాయి.వరుణుడు గతరెండు రోజులుగా వర్షానికి సెలవు ఇవ్వగా లింగంపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువుల క్రింద వరినాట్లు జోరందుకున్నాయి.రైతులు వరినాట్లు వేయడంలొ బిజీ బిజీగా ఉంటు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.రైతులు కూలీలు దొరకక సతమత మవుతు ఇతర మండలాల నుంచి కూలీలను తెప్పించు కుంటున్నారు.అంతే కాకుండ ఓకరికి ఒకరు బదులు వెల్లుతు వరినాట్లు వేస్తున్నారు.ఏదిఏమైనప్పటికి ఈసారి వర్షాలు తొందరగా పుష్కలంగా పడి చెరువులు కుంటలు నింపడం పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆనందోత్సవాల మధ్య కూలీలు కూనిరాగాలతొ పాటలు పాడుకుంటు వరినాట్లు వేయడంతో గ్రామాల్లోని పొలాల ప్రాంతంలో పచ్చదనంతొ నేలమ్మ పరువల్లు తొక్కు తుంది.దీంతొ రైతులు కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



