చెలరేగిన గుప్తిల్‌..

   

155 బంతుల్లో 189 పరుగులు..
ఇంగ్లండ్‌పై ఘన విజయం
నాట్‌వెస్ట్‌ టైటిల్‌ గెలుచుకున్న కివీస్‌
సౌతాంప్టన్‌, జూన్‌ 2 (జనంసాక్షి) :
నాట్‌వెస్ట్‌ ట్రోఫీలో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ జట్టు 86 పరుగుల తేడాతో విజయం సాధించి  కివీస్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపును సొంతం చేసుకున్న కివీస్‌ ఇంకా మ్యాచ్‌ మిగిలి ఉండగానే టైటిల్‌ను చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 359 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ గుప్తిల్‌ రెచ్చిపోయి ఆడాడు. 155 బంతుల్లో 189 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. రోంచి 9 బంతుల్లో 2 పరుగులు చేసి అండర్సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్స్‌న్‌ 63 బంతులు ఆడి 55 పరుగులు చేశాడు. స్వన్‌ బౌలింగ్‌లో షాట్‌ కొట్టబోయి ఔటయ్యాడు. టేలర్‌ 60, మెక్‌ కల్లమ్‌ 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కేవలం 273 పరుగులకే కుప్పకూలింది. ట్రాట్‌ 109 పరుగులతో ఒంటరి పోరు చేసినా ఫలితం లేకుండా పోయింది. మిగతా ఆటగాళ్లు కుక్‌ 34, బెల్‌ 25, రూట్‌ 28, మోర్గాన్‌ 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు.