చేనేత కార్మికుల అందోళన

వడ్డేపల్లి : మండలంలోని రాజోలి గ్రామంలో పట్టురేషం కోనుగోలుపై ఇచ్చే రాయితీకి సంబందించి అవకతవకలు జరుగుతున్నాయంటూ చేనేత కార్మికులు మంగళవారం అందోళనకు దిగారు. రాయితీని అనర్హులకు ఇస్తూఅర్హులను అన్యాయం చేస్తున్నారని. అలాగే రాయితీ సోమ్ము ఇచ్చేందుకు ఒక్కోక్కరి నుంచి అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారని అదికారులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ అదనంగా రూ. 20 వసూలు చేయటం తమకు తెలియదని, సిల్క్‌ సంఘం వారే చేస్తున్నరని అన్నారు. అర్హులకు సంబంధించి ఇంటింటి సర్వే చేపడతామన్నారు.