-చేనేత వారసత్వ సంపదను కాపాడాలని కోరారు.

-ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలి.
-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 7(జనంసాక్షి):

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించు కొని చేనేత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ,జిల్లా విద్యాశాఖల ఆధ్వర్యం లో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల ర్యాలీని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి జెండా ఊపి ప్రారంభించి, కలెక్టరేట్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించారు.అనంతరం కలెక్టరేట్ ఆవరణలో చేనేత కార్మిక దంపతులు వెంకట్ నారాయణ, పద్మమ్మలను శాలువాతో సన్మానించారు.శనివారం నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన వివిధ పాఠశాలల విద్యార్థులకు మెమొంటోళ్లు, సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ…చేనేత వస్త్రాలను ప్రజలు వినియోగించాలని ఆమె అన్నారు.
చేనేత వారసత్వ సంపదను కాపాడాలని కోరారు. చేనేత వస్త్రాలను విరివిగా వాడుకోవాలని సూచించారు.చర్మానికి రక్షణగా ఉంటాయన్నారు. హుందాతనంను పెంచుతాయని ఆమె పేర్కొన్నారు.
దసరా పండుగకు ఆడపడుచులకు చీరలు పాఠశాలల విద్యార్థులకు యూనిఫాములన ను చేనేత రంగాల నుంచే అందజేయడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేసేలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.
ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని తోడ్పాటు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హాజరైన అతిథులకు చేనేత వస్త్రాలతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన,మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్ జక్కా రాజు,వెనుకబడిన తరగతుల సహాయ అధికారి శ్రీధర్ జి, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఎస్ జి ఎఫ్ ప్రసాద్ గౌడ్, సెక్టోరల్ అధికారిని సూర్య చైతన్య, వెంకటేశ్వర్ల శెట్టి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.