చేపల ఉత్పత్తి తో గిరిజనులకు ఆర్థికంగా తోడ్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి

ములుగు జిల్లా
తాడ్వాయి12 (జనం సాక్షి):-
తాడ్వాయి మండలంలోని 85 చెరువులకు 10 లక్షల చేప పిల్లల పంపిణీ పిల్లి శ్రీపతి జిల్లా మత్స్య శాఖ అధికారి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉచిత చేప పిల్లలను తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు .ఈ సమ్మక్క సారలమ్మ మండలంలోని 13 ఏజెన్సీ గ్రామ పంచాయతీ పరిధిలోని 85 చెరువులకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో చేపల పెంపకానికి ఆంధ్ర పాలకులు దోహద పడలేదన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజనుల్లో నీలి విప్లవం తో ఆర్థికాభివృద్ధి కి తోడ్పపడుతున్నదన్నారు.అంతే కాకుండా గిరిజనులకు పౌష్టికాహారం అందించే దిశగా ముందడగులు వేస్తుందన్నారు.జిల్లా మత్స్య శాఖ అధికారి పిల్లి శ్రీపతి మాట్లాడుతూ మండలంలోని 9 గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల కు85 కుంటలు మరియు చెరువులకు 10 లక్షల చేప పిల్లలను పంపిని చేయడం జరిగిందన్నారు
ఈ కార్యక్రమంలో జెడ్ పి సి ఈ ఓ ప్రసునా రాణి ఎంపీపీ గొంది వాణిశ్రీ ఐటీడీఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్,తహశీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో తాడ్వాయి,స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ జిల్లా మత్స్య శాఖ ఫీల్డ్ అధికారి రమేష్ జి సి సి డైరెక్టర్ ఫుల్సం పురుషోత్తం వివిధ గ్రామాల పెసా మోబిలైజర్స్ మత్స్య శాఖ సిబ్బంది కృష్ణ సౌజన్య  వివిధ గ్రామాల సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Attachments area