చేపల పరిశ్రమ పై యువతకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం
గరిడేపల్లి, జూలై 27 (జనం సాక్షి):యువత చేపల పెంపకం పై శిక్షణ ను పొంది మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయాలనీ గరిడేపల్లి ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ అన్నారు.కేవీకే గడ్డిపల్లి లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔస్థాహిక యువత కు జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారం సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ హైదరాబాద్ వారి సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణ కార్యక్రమం అయిదో బ్యాచ్ ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొని శిక్షణ ను ప్రారంభించి యువత ను ఉద్దేశించి ప్రసoగించారు . యువత వృత్తి నైపుణ్యత శిక్షణ పొంది చేపల పెంపకం చేపట్టడం చేపల మార్కెటింగ్ మొదలగు అంశాలలో ఉపాధిని పొందవచ్చునని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో యువత మంచి నీటి చేపల పెంపకం పై ఆసక్తి చూపిస్తున్నారని కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ హెడ్ బి. లవకుమార్ అన్నారు . తదుపరి 15 రోజుల పాటు నిర్వహించే మత్స్య పరిశ్రమ లో చేపల పెంపకం యాజమాన్యం పట్టుబడి విలువదారిత ఉత్పత్తుల తయారీ, క్షేత్ర సందర్శన తదితర నిర్వహించ బడే అంశాలు వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా యువత చేపల పరిశ్రమలో ఉపాధి స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు నరేష్, కిరణ్, నరేష్, ఆదర్శ్ , డా. టి. మాధురి, సుగంది జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన మత్స్య రైతులు యువత పిడమర్తి నాగరాజు, సురేందర్, పులి వెంకన్న , కాంపటి సైదులు, రమేష్, బేబీ, మౌనిక, త్రివేణి, రోహిణి, ప్రియాంక లతో పాటు 30 మంది పాల్గొన్నారు.
Attachments area