చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 3(జనంసాక్షి):ఆశయాలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఇరు దేశాలు చాలా సున్నితంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో
న్నారు. చైనాలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ఆయన హాంగ్‌ఝౌలో ఆదివారం చైనా అధ్యక్షుడిని కలిసి కాసేపు మాట్లాడారు. భారత్, చైనాల మద్య ఉన్న పలు
ఉద్రిక్త పరిస్థితులు, జరగాల్సిన ఒప్పందాలకు సంబంధించి వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి.’ఇరు దేశాల ఆకాంక్షలను పరస్పరం గౌరవించుకోవాలని, సున్నితంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు’ అని భారత విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. ఇండియా-చైనాల మధ్య
సంబంధం ఒక్క ఇరు దేశాలకే కాకుండా మొత్తం ఆసియానికి, ప్రపంచానికి చాలా ముఖ్యం అని కూడా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడికి చెప్పారు.దీనికి స్పందించిన చైనా అధ్యక్షుడు కూడా తాము తప్పకుండా ఇరు దేశాల మధ్య సంబంధాలను, ఆకాంక్షలను గౌరవిస్తామని బదులిచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు, సమస్యలకు కారణమైన ప్రశ్నలకు సమాధానం కనుగొని వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ఒకరు ఈ విషయం స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై కలిసి ఉమ్మడి పోరు చేయాలని కూడా మోదీ గట్టిగా చెప్పారు. గత మూడు నెలల్లో చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ అవడం ఇది రెండోసారి.