*జంతు జనన నియంత్రణ కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్*

గద్వాల నడిగడ్డ ఆగస్టు 6 (జనం సాక్షి);
  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 31వ వార్డ్ పరిధిలోని  జిల్లా వెటర్నరీ కార్యాలయ ఆవరణలో శనివారము   35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసిన జంతు జనన నియంత్రణ కేంద్రం ను  ఎమ్మెల్యే  బండ్ల కృష్ణమెహన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ శ్రీహర్ష చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.
అనంతరం జంతు జనన నియంత్రన కేంద్ర లోను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఛైర్మన్ పరిశీలించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ
రాష్ట్రంలోని సీఎం కేసీఆర్  నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కెటిఆర్  లో ఆధ్వర్యంలో జంతు జనన నియంత్రణ కేంద్రం ప్రారంభించడం జరిగిందన్నారు.  కుక్కలు, కోతుల బెడద  రోజు రోజుకు పెరిగిందనీ, దీంతో వృద్ధులు, వికలాంగులు చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని,
ప్రభుత్వం పురపాలక,వెటర్నరీ సమన్వయంతో జంతు జనన నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందనన్నారు. అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో కుక్కలు, కోతులు ఎక్కువ ఉంటే వెంటనే పురపాలక సిబ్బందికి నేరుగా సమాచారం ఇవ్వాలని, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా వారికి తెలియజేసేయాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ,ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, జిల్లా వెటర్నరీ అధికారి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ యు.ఆర్.రమేష్, పశు వైద్య సిబ్బంది,మున్సిపల్ కమీషనర్,తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area