జగన్‌కు బెయిల్‌ వస్తుందన్నది వైకాపా ఆశ :గండ్ర

హైదరాబాద్‌ : జగన్‌కు బెయిల్‌ వస్తుందన్నది వైకాపా ఆశ అని , వాస్తవాలు న్యాయస్థానంలో తేలతాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైకాపాలో నాయకత్వంపై నేతలు తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొందన్న ఆయన ఆ పార్టీ నేతలు ఇళ్లు చక్కబెట్టుకుంటే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వంపై షర్మిల అనవసర విమర్శలు మానుకుని సోదరుడిని కేసు నుంచి విముక్తి చేసేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. కొండా దంపతులు కాంగ్రెస్‌ లోకి వస్తారనడం మీడియా వూహాగానాలేనన్నారు.