జగన్ అక్రమాస్తులను పూర్తిగా జప్తు చేయాలి: నేత నరేందర్‌రెడ్డి
వరంగల్ : జగన్ అక్రమాస్తులను పూర్తిగా జప్తు చేయాలని తెదేపా అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమాస్తులను దర్యాప్తు సంస్థలు ఓవైపు జప్తు చేస్తుంటే.. జగన్ విడుదల కోసం వైకాపా నేతలు కోటి సంతకాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ అన్ని ఆస్తులు ఎలా సంపాధించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ వ్యక్తం చేశారు.