జగిత్యాలలో జోరుగా ప్రచారం
సుడిగాలి పర్యటనలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు
జగిత్యాల,సెప్టెంబర్24(జనంసాక్షి): జగిత్యాల జిల్లాలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు దూకుడు పెంచారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రచార¬రు సాగుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు డాక్టర్ సంజయ్, విద్యాసాగర్ రావు, కొప్పుల ఈశ్వర్‌ల ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని కారు గుర్తుకు ఓటేస్తామంటూ నినదించారు. అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని వీరు హావిూనిచ్చారు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్థానికులు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కొనసాగాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరల కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా చేయాలని అన్నారు. 70 ఏళ్ళలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం నాలుగున్నరేళ్ళలో చేసి చూపించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో వంద సీట్లను కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలో కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలను, ప్రచారాలను చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం కల్పించారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రచారానికి విశేష ప్రజాదరణ లభిస్తోంది. గ్రామస్థులు బతుకమ్మ ఆటపాటలతో విద్యాసాగర్ రావుకు ఘనంగా స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్ కే ఓటేస్తామని.. టీఆర్‌ఎస్ అభ్యర్థి విద్యాసాగర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి జనం భారీ ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. మహిళలతోపాటు యువకులు, జనం ఇతర పార్టీలకు గుడ్ బై చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.