జడేజా….


లండన్‌,జూన్‌ 22 (జనంసాక్షి):

ఛాపించన్స్‌ ట్రోఫీలో బంతితో అద్భుతంగా రాణిస్తున్న భారత్‌ అల్‌ రౌండప్‌ రవీంద్ర జడేజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ బౌలర్ల జాడితలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. అతను మూడు స్థానాలు మెరుగై నాలుగో ర్యాంకులో నిలిచాడు. అశ్విన్‌ ఓజ సాకథనం తగ్గి 15వ ర్యాంకులో నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్‌ స్టెయిన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జడేజా ఆల్‌ రౌండర్ల జాబితాలోనూ నాలుగో స్థానంలో ఉండటం విశేషం. బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో ధావన్‌ తొలిసారి టాప్‌-50లోకి వచ్చాడు. అతను 50వ స్థానంలో ఉన్నాడు. డివిలియర్స్‌ అగ్రస్థానంలో ఉండగా ఆమ్లా, కోహ్లి, ధోని తర్వాతి ర్యాంకుల్లో నిలిచారు. రైనా ర్యాంకు 14 జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ 121 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌ 113 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.