జడేజా గిరాకీ పెరిగింది


న్యూ ఢిల్లీ:ఐసీఎల్‌ ఛాంపియన్స్‌ ట్రోఫిలో అద్భుత ఆట తీరుతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్రజడేజాపై కీర్పోరేట్‌ కన్ను పడింది. సర్‌ జేజాను తమ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా కార్సొరేట్‌ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే జీటీవీ జడేజాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జడేజా బ్రాండ్ల ఒప్పందాలను పర్యవేక్షిస్తున్న రితి స్పోర్స్ట్‌ మేనేజర్‌ మాట్లాడుతూ… ‘జడేజాకు గిరాకి బాగా పెరెగింది. అతడితో ఒప్పందం కుదుర్చుకోవడానికి కంపెనీల వారు క్యూ కడుతున్నారు. త్వరలో జడేజాకు సరిపోయే బ్రాండ్స్‌ను సెలక్ట్‌ చేస్తాం’ అని అన్నారు. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫిలో జడేజా ‘గోల్డెన్‌బాల్‌’ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.