జడ్జీల నియామకంపై సుప్రీం సంచన తీర్పు

3

– ఆ కమీషన్‌ రాజ్యాంగ విరుద్ధం

ఢిల్లీ  అక్టోబర్‌ 16 (జనంసాక్షి):

ఎన్‌ డిఎ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. పాత పద్ధతిలోనే జడ్జీల నియామకం జరగాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల కోసం గతంలో ఉన్న కొలీజియం వ్యవస్థస్థానంలో మోడీ సర్కారు ఎన్‌జేఏసీని తీసుకువచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు…. జడ్డీల నియాయకంపై ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. కొలీజియం వ్యవస్థను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. జడ్జీల నియామకం విషయంలో గతంలోని కొలీజియం వ్యవస్థనే కొనసాగించాలని కోర్టు తెలిపింది. నేషనల్‌ జ్యుడీయల్‌ కమిషన్‌ ఏర్పాటు రాజ్యాంగం విరుద్ధమని స్పష్టం చేసింది. జడ్డీల నియామకంలో కేంద్రం జోక్యం.. న్యాయవ్యవస్థకు మంచిది కాదని ధర్మాసనం హితవుపలికింది.