జడ్పీటీసీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఐకె రెడ్డి,ఎమ్మెల్యేలు.

నెరడిగొండడిసెంబర్7(జనంసాక్షి):మండల జడ్పిటిసి అనిల్ జాధవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర దేవాదాయ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జోగు రామన్న జిల్లా జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్ పలువురు ప్రముఖ నాయకులు సోమవారం రోజున మండలంలోని రాజుర గ్రామానికి వెళ్లి అనిల్ జాధవ్ కుటుంబ సబ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వర్గస్తులైన శ్యామ్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి వెంట మండల ఎంపీపీ రాథోడ్ సజన్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు