జడ్పీటీసీ గీకురు రవిందర్ కు పలువురి పరామర్శ

జనంసాక్షి/చిగురుమామిడి- సెప్టెంబర్ 26:
జడ్పీటీసీ గీకురు రవీందర్ సతీమణి కావ్య ఇటీవల అనారోగ్యముతో చనిపోగా సోమవారం రోజున వారి స్వగృహంలో కావ్య చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలవేసి నివాళులర్పించారు. కరీంనగర్ జడ్పి వైస్ చైర్మన్ గోపాలరావు, టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు వొడితెల ప్రణవ్ బాబు, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిళి రమేష్, జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, కోహెడ ఎంపీపీ కీర్తి సురేష్ ,రిటైర్డ్ ఆర్డీవో ఈశ్వరయ్య, హుస్నాబాద్ ఎంపీడీవో కుమారస్వామి, సూపర్డెంట్ ఖాజమొయినుద్దీన్, సర్పంచులు బోయిని శ్రీనివాస్, సన్నీళ్ల వెంకటేష్, గోలి బాపు రెడ్డి, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి, కొండపల్కల ఎంపీటీసీ శ్రీధర్, సైదాపూర్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య, ఎస్సి సెల్ అధ్యక్షులు బెజ్జంకి అంజయ్య, ధరణి కంస్ట్రక్షన్ అధినేతలు మాధవరెడ్డి,సురేందర్,పోటు మల్లారెడ్డి, పిల్లి తిరుపతి,చందు తదితరులు పరామర్శించారు.