జనంసాక్షి జర్నలిస్టుకు ఘనంగా నివాళులు.

జర్నలిస్టు తిరుపతయ్య మృతి తీరనిలోటు.
కుటుంబానికి అండగా ఉంటాం.
సీనియర్ జర్నలిస్టులు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు5(జనంసాక్షి):

తాడూరు మండలం జనంసాక్షి రిపోర్టర్ తీగల తిరుపతయ్య గతంలో తాడూర్ మండల కేంద్రంలో వివిధ దినపత్రికలలో పనిచేస్తూ రిపోర్టర్ గా తన వృత్తి ధర్మాన్ని నిబద్దతతో నిర్వహించారని సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్లా ఖాన్ ,ముమ్మడి శేఖరా చారి, కొండకింది మాధవరెడ్డి,హకీం కిషోర్ తదితరులు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద జర్నలిస్టు తిరుపతయ్య మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తిరుపతయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. జర్నలిజం వృత్తిలో తిరుపతయ్య ఎంతో ఓర్పుతో పని చేశారన్నారు. గ్రామీణ ప్రాంత సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువస్తూ వృత్తి ధర్మంలో నిబద్ధతతో మెలిగారన్నారు.తిరుపతయ్య కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరియు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో మాట్లాడి లక్ష రూపాయల ఆర్థిక సహాయం మరియు అతని కుటుంబానికి నెలకు 3వేల రూపాయల పెన్షన్ పథకాన్ని వర్తింపజేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని సీనియర్ జర్నలిస్టు అబ్దుల్లా ఖాన్ అన్నారు. తిరుపతయ్య కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించి ఆదుకునే విధంగా జర్నలిస్టులందరం ఐక్య మత్యంగా ముందుకు సాగుదామని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. అంతకు ముందు తిరుపతయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఫోటో వీడియో జర్నలిస్టులు ఉమాశంకర్,సత్యం, సందు యాదగిరి, ప్రదీప్,యాదయ్య,పంగిడి చెరువు వెంకటస్వామి,బాదం పరమేశ్వర్, రాజు, సహదేవుడు,రామకృష్ణ,సాదిక్,అల్లం పల్లి రమేష్, శేఖర్,వెంకట్ రెడ్డి, దశరథం, గణేష్ మరియు ప్రజాసంఘాల నాయకులు పొదిలి రామయ్య, అంతటి కాషన్న తదితరులు పాల్గొన్నారు.