జనం కోసం పాదయాత్ర చేశా

ముగిసిన బాబు యాత్రవిశాఖపట్నం, ఏప్రిల్‌27 (జనంసాక్షి) :
జనం కోసమే పాదయాత్ర చేశానని టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు అన్నారు. ఆయన చేపట్టిన వస్తున్న మీకోసం పాద యాత్ర శనివారం విశాఖపట్నంలో ముగిసింది. ఈ సందర్భంగా నిర్మించిన 60 అడుగుల పైలాన ్‌ను బాబు ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్య క్రమంలో బాబు సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ  లోకేష్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల కోసం వారి పక్షాన యాత్ర చేశానని అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. 2012 అక్టోబర్‌ 2న అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబునాయుడు ‘వస్తున్నా…విూకోసం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 208 రోజుల పాటు- 2817 కిలో విూటర్ల మేర చంద్రబాబు మహాపాదయాత్ర సాగింది. రాయలసీమ, కోస్తా, తెలంగాణాల్లో 16 జిల్లాలు, 86 నియోజకవర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు నగరాలు, 162 మండలాలు, 1253 గ్రామాల్లో బాబు పాదయాత్ర కొనసాగింది.తన అరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా 63 ఏళ్ల వయసులో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే కష్టాలు తీరుస్తానని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజాసంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ అన్ని చోట్లా బాబు వరాలు ప్రకటించారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో కీలకమైన సమస్యల పరిష్కారానికి డిక్లరేషన్‌లు ప్రకటించారు.