జనగామ చౌరస్తాకు దివంగత డాక్టర్ ఉండ్రు మార్గ్ గా నామకరణం చేయాలి-బక్క ప్రవీణ్ కుమార్
జనగామ (జనం సాక్షి) అక్టోబర్ 23 :జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాకు దివంగత డాక్టర్ ఉండ్రు మార్గ్ గా నామకరణం చేయాలని జనగామ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ బక్క ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఆదివారం జనగామలో డాక్టర్ ఉండ్రు 110వ వర్దంతి సందర్భంగా సమాది వద్దకు వెళ్ళి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జనగామలో 1902లో ప్రస్తుతం ఉన్న బస్టాండు, చౌరస్తా, ఉనృపుర బాప్టిస్ట్ చర్చి,ఎరియా కలుపుకుని ప్రెస్టన్ వరకు నలుదిక్కులా డాక్టర్ ఉండ్రు 87,88,89,158, 147 సర్వే నంబర్లలో 60 ఎకరాల భూమి కొనుగోలు చేశారని అన్నారు. ఉండ్రు మిషనరీ రూథర్ పేద బడుగు వర్గాలకు విద్య, వైద్యం బాప్టిస్ట్ సంఘాల స్థాపనకు కృషి చేశారని గుర్తు చేశారు. మహనీయుల సేవలు అందించిన వారి స్మారకార్థం జనగామ చౌరస్తా కు దివంగత డాక్టర్ ఉండ్రు మార్గ్ గా నామకరణం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రెవ . డాక్టర్ పిలిప్, కర్రోల్ల జాన్, బక్క శ్రీను, రాజారత్నం, దామెర జేమ్స్, చర్చి సభ్యులు ప్రెస్టన్ ఇన్ స్టిట్యూట్ స్టాఫ్, స్త్రీల సమాజం పాల్గొన్నారు.