జనని స్తన్యం.. జన్మ ధన్యం..

– తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం

డోర్నకల్ ఆగస్టు 7 (జనం సాక్షి)

డబ్బా పాలు వద్దు.. తల్లి పాలే ముద్దు..ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ పౌష్టికాహారం తల్లి పాలే..పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రు పాలు పట్టించడం తప్పనిసరి అని సిడిపిఓ ఎల్లమ్మ తెలియజేశారు.తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా నిర్వహిస్తున్నారు.శనివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఐసిడిఎస్ కేంద్రంలో సిడిపిఓ ఎల్లమ్మ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.ముఖ్య అతిథులు ఎంపీడీవో అపర్ణ,కౌన్సిలర్లు తేజావత్ సంధ్యారాణి,కందుల అరుణ,ఫర్విన్ సుల్తానా,మౌనిక జైన్,వైద్యురాలు కనకదుర్గ మాట్లాడారు.పుట్టిన పిల్లలకు మొర్రు పాలు అత్యంత పోషకాల గవిని అని అన్నారు.పిల్లలకు తల్లి పాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.నవజాత శిశువులకు తల్లి పాలు అమృతతుల్యమైనవి అన్నారు.కొందరు తల్లులు కొంతకాలం పాలిచ్చి ఆ తర్వాత డబ్బా పాలు పడుతున్నారు.ఈ క్రమంలో తల్లిపాలకు బిడ్డ పూర్తిగా నోచుకోవడం లేదన్నారు.దీంతో శిశువు తరచూ అనారోగ్యానికి గురై అవకాశం అధికంగా ఉందన్నారు.తల్లి పాలలో ప్రోటీన్ అధికంగా ఉంటుందన్నారు.రొమ్ము పాలు యాంటీబాడీస్ తో ఉత్పత్తి అవుతాన్నారు.వైరస్,బ్యాక్టీరియాలతో పోరాడడానికి సహాయ పడతాయి.డబ్బా పాలు తాగిన పిల్లలతో పోలిస్తే తల్లి పాలు తాగిన వారిలో ఊబకాయం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు.
తల్లి పాలతో పిల్లల్లో మేధో శక్తి పెరుగుతుందన్నారు.కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది శారద,విజయలక్ష్మి,సూపర్వైజర్లు,అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలు,పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.