జనరిక్‌ మందుల ఊసేదీ

జనాలను ముంచడం లక్ష్యంగా అమ్మకాలు
నిజామాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): జిల్లాలో వైద్యులు జనరిక్‌ మందుల ఊసెత్తడం లేదు. మందుల చీటీ రాసిన వైద్యుడు ఒప్పందం కుదుర్చుకున్న మందుల దుకాణదారుడి మాత్రమే అర్థమవ్వడంతో అసలు విషయం రోగులకు అర్థం కావడం లేదు. అన్ని వైద్య శాలల్లో జనరిక్‌ మందులను విరివిగా రాయాలనే నిబంధన జిల్లాలో అమలు కావడం లే దు. కొంతమంది ప్రయివేటు వైద్యులు వైద్యాన్ని వ్యాపారంగా చేడడంతో ఈ పరిస్థితి నెలకొంది. జబ్బు చేసి ఆసుపత్రికి వెళ్తే చాలు అడ్డగోలు మందుల పేరుతో రోగుల నడ్డి విరుస్తున్నారు. కొంతమంది వైద్యులు రోగులకు మందులను రా సిచ్చే ప్రిస్క్రిప్షన్‌లో జనరిక్‌ మందుల ఊసెత్తడం లేదు. కవిూషన్‌లు ఇచ్చే కంపేనీలకే వైద్యులు పె ద్దపీట వేస్తూ ఎక్కువ ధర కలిగిన మందులను రాస్తున్నారు. ప్రయివేటు వైద్యశాలలో ప్రిస్క్రిప్ష న్‌ రాసే మందులోనూ జనరిక్‌ మందుల్లో ఓకే ఫార్ములా ఉన్నప్పటికీ వైద్యులు ఫార్మసీ కంపెనీ లకే పెద్దపీట వేస్తుండటంతో ప్రజలపై అధిక భారం పడుతోందనే విమర్శ ఉంది. జలుబు కో సం ఉపయోగించే సిట్రిజన్‌ 10 మాత్రల షీటు బయట మెడికల్‌ షాపులో రూ.20 నుంచి 25 విక్రయిస్తుండగా.. జనరిక్‌ మందులు కేవలం రూ.4 లభిస్తోంది. అంటే బయట లభించే మం దులకు రూ.16 నుంచి 20 ఎక్కువ చెల్లించాల్సి వస్తుండగా యాంటిబయెటిక్‌ మాత్రలు సరాసరి రూ.50 నుంచి 70 తేడా ఉంటుంది. ఈ క్రమం లో ఒక్కసారి ఆసుపత్రికి వెళ్లి వస్తే రూ.600 నుంచి 800 వరకు కేవలం మందుల కొనుగోలు కే ఖర్చు చేయాల్సి రావడంతో ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతోంది. రోగులను పరీక్షించిన అనంతరం అన్ని వైద్య శాలల్లో మందులు రాసే ప్రిస్క్రిప్షన్‌పై కంపెనీ ల పేరు కాకుండా కేవలం మందులే రాయాలని గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్ర్‌లో అ క్షరాలు విడివిడిగా సులువుగా అర్థమయ్యే రీతిలో ఉండాలని సూచించినప్పటికీ అవేవిూ వైద్యులు పాటించడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను సై తం పెడచెవున పెడుతూ వైద్యులు తమ పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు. మెడికల్‌ షాపుల్లో అనర్హులు మందులు విక్ర యిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ విషయమై అధికారులు ఏ మాత్రమూ పట్టించు కోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.చాలామంది నిర్వాహకులు కిరాయి ఆర్హత సర్టిఫికెట్లతోనే నడిపిస్తున్నట్లు సమాచారం. మా మూళ్లకు అలవాటు పడిన సంబంధిత అధికారులు చూసి చుడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ప్రజలు కోరుతున్నారు.