జనహితమే జడ్పిటిసి లక్ష్యం
ఆర్థిక సాయం అందజేత
శివ్వంపేట సెప్టెంబర్ 23 జనంసాక్షి : మండల పరిధిలోని గోమారం గ్రామానికి చెందిన మున్నూరు క్యాధరమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యులు, స్థానిక జడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా శుక్రవారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ పెద్దపట్లోరి లావణ్య మాధవరెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం కింద 5 వేల నగదు పంపిణీ చేయడం జరిగింది. సమాజంలో ఎవరికి ఎంత సంపాదన ఉందనేది ముఖ్యం కాదని జీవితకాలంలో చేసిన మంచి పనులే వ్యక్తులకు గుర్తింపును ఇస్తాయని గోమారం సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి పేర్కొన్నారు. శివ్వంపేట జడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా ఎవరైనా ఆయనను సహాయం అడిగిన అడగకున్నా బాధిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గోమారం సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, శివ్వంపేట ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, నాయకులు రాజేందర్, ఎస్టీ సెల్ రవి నాయక్, ఆనంద్, రాములు, అంజయ్య, నర్సింలు, బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.