జనాభా పెరుగుదలే అనార్ధాలకు మూలం
కడప, జూలై 11 : జనాభా పెరుగుదల అనేక అనార్ధాలకు మూలమని జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కడప జిల్లాలో అనేక ప్రాంతాల్లో బుధవారం ర్యాలీలు జరిగాయి. కడప నగరంలో జరిగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ కడప నగరంలోని అన్ని ప్రధాన వీధుల గుండా సాగింది. జనాభా పెరుగుదలకు అట్టుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. జనాభా పెరుగుదల పట్ల ప్రజలను చైతన్య వంతులు చేయాలని ఆయన సూచించారు. చిన్న కుటుంబం సంతోషాలకు నిలయంగా ఉంటుందన్న విషయం ప్రతిఒక్కరు గుర్తించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ ర్యాలీలు జరిగాయి.