జన్మదినం సందర్భంగా అన్నదానం.

నెన్నెల, అక్టోబర్22, (జనంసాక్షి)
నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామంలో కొండ సరిత రమేష్ గౌడ్ దంపతుల కూతురు శాన్వి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ప్రభుత్వం పాఠశాలలో అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ కూతురు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ అని, ఈనెల 24 పుట్టినరోజు ఉన్నప్పటికీ ఆసమయంలో పాఠశాలకు దీపావళి సెలవులు ఉన్నందున ముందస్తుగా జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు భోజనం అందించి, వారి కూతురు జన్మదిన వేడుకలు జరపడం అభినందనీయమని పాఠశాల ఉపాద్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

తాజావార్తలు