జయముఖి ఫార్మసీ కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన

జనం సాక్షి, చెన్నరావు పేట డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్డే ని పురస్కరించుకొని జయముఖి ఫార్మసీ కళాశాల యొక్క జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాలు శ్వేత హెచ్ఐవి వ్యాప్తి చెందడం గురించి మాట్లాడుతూ హెచ్ఐవి కేవలం సెక్స్ వల్ల మాత్రమే కాకుండా ఇతరులు వాడిన సిరంజి, సూదుల వల్ల వ్యాప్తి చెందుతుందని హెచ్ఐవి గర్భంతో ఉన్న తల్లి నుంచి శిశువుకి సంక్రమించవచ్చు అని తెలిపారు.కళాశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎస్ పాసు దేవమూర్తి మాట్లాడుతూ పూర్వం సర్జికల్ వస్తువులు, నీడిల్స్ వేడినీళ్లతో స్టెరిలైజ్ చేసే వాళ్ళు. కానీ ఈ రోజులలో డిస్పోజబుల్ వాడటం వల్ల ఎయిడ్స్ సంక్రమణ చాలావరకు నివారించగలిగామని తెలిపారు. హెచ్ఐవి పేషెంట్ ని స్పర్శించడం వల్ల గాని, అతనితో కలిసి భోజనం చేయడం వల్ల గాని హెచ్ఐవి వ్యాప్తి చెందదని 1990లో ప్రిన్సెస్ డయానా తెలిపారని గుర్తు చేశారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ కు ఇప్పటివరకు సరైన మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు. అనుకోకుండా హెచ్ఐవి బారిన పడినవారు  అధైర్య పడకుండా డాక్టర్ సలహా మేరకు తగు మందులు వాడుతూ ఎప్పటిలాగే జీవించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అశ్విన్ కుమార్, కళాశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎస్ వాసుదేవ మూర్తి, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.