జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పంపిణీ.

అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డులు అందజేస్తాం.
జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.

జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందజేస్తామని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ వెల్లడించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్ లో 2022-24 సంవత్సరానికి  కమిటీ మెంబర్లు, వివిధ పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు, మీడియా జర్నలిస్టులకు 66 అక్రిడిటేషన్ల కార్డుల ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో 366మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరయ్యాయని,విడతల వారిగా అర్హులైన వారందరికీ ఇస్తామన్నారు. చిన్నపత్రికలు,మీడియం పత్రికల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల వారం రోజుల్లో అందజేస్తామని తెలిపారు.కాగా జర్నలిస్టుల ప్రతినిధులు పలు అంశాలను కలెక్టర్‌  దృష్టికి తీసుకెళ్ళారు.డిపిఆర్ఓ సీతారాం అధ్యక్షతన జరిగిన పంపిణీ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు అబ్దుల్లా ఖాన్, సురేష్, పరిపూర్ణం,కపిలవాయి రాజు,కొండకింది మాధవరెడ్డి, విజయ్ కుమార్ లతో పాటు జనంసాక్షి జిల్లా స్టాప్ రిపోర్టర్ సందు యాదగిరి,వుదయం జిల్లా స్టాప్ రిపోర్టర్ మలి పెద్ది రమేష్,వార్తా తరంగాలు స్టాప్ రిపోర్టర్ హకీం కిషోర్,ఫ్రైం న్యూస్ జిల్లా స్టాప్ రిపోర్టర్ కంచెర్ల శ్యాం సుందర్, మెట్రో ఈవెనింగ్ జిల్లా స్టాప్ రిపోర్టర్ నింగికి చెరువు వెంకట్ స్వామి, వివిధ పత్రికల మరియు ఎలక్ట్రానిక్ విభాగాల స్టాఫ్ రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.