జర్నలిస్టులకు నియంత్రణాసంస్థ ఉండాలి : కైలాస్‌నాథ్‌ కట్టూ

మంగుళూరు : మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరహాలో జర్నలిస్టులకు కూడా ఒక నియంత్రణ సంస్థ ఉండాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మార్కండేయ కట్టూ అన్నారు. బలవంతంగా సొమ్ము గుంజటం, బ్లాక్‌మెయిల్‌ నేరాలకు పాల్పడిన మీడియా విలేరులకు శిక్ష పడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సొమ్ము ప్రధానంగాను, సంచలన వార్తలే ప్రధానంగా టీఆర్‌పీ రేటింగ్‌ పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం లాంటి చర్యల వల్ల మీడియా సమాజానికి సేవ చేయలేదు. వైద్యులకు వైద్యమండలి, లాయర్‌లకుబార్‌ కౌన్సిల్‌ ఉన్నప్పుడు జర్నలిస్టులకు కూడా ఒక నియంత్రణ సంస్థ ఎందుకుండరాదని ప్రశ్నించారు.