జర్నలిస్టులకు నూతన అక్రిడియేషన్ కార్డులను అందజేసిన – కలెక్టర్
కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 2 (జనంసాక్షి);
2022 -24 సంవత్సరాలకు గాను కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారము తన ఛాంబర్లో మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
మొదటి విడతగా 330 మంది జర్నలిస్టుకు అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన మిగతా జర్నలిస్టులకు
కూడ సాధ్యమైనంత త్వరలో కార్డులు మంజూరు చేయాలనీ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ను కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.వారం రోజుల్లోగా కమిటీ సమావేశం నిర్వహించి మిగిలిన అర్హులకు కార్డులు అందజేయాలని జిల్లా కలెక్టర్ డిపిఆర్ఓ ధశరథం కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ కన్వీనర్ డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, కమిటీ సభ్యులు బాలార్జున్ గౌడ్, కృష్ణమూర్తి ,భూపతి, ఆంజనేయులు, భాస్కర్, రజినీకాంత్, పాల్గొన్నారు.