-జర్నలిస్టుల బస్ పాస్ పరిధి తగ్గింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

-టియుడబ్ల్యూజే (ఐజేయు)
జిల్లా ఉపాధ్యక్షులు కొండకింది మాధవరెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు9(జనంసాక్షి):

అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు రాక ఆందోళన చెందుతున్న క్రమంలో అక్రిడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులపై ఆర్టీసీ ప్రయాణంలో తగ్గింపులు చేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించు కోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు కొండకింది మాధవరెడ్డి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం,మండల అక్రిడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులకు బస్సు ప్రయాణంలో తగ్గింపులు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసహరించు కోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల కోసం కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకపోగా వున్న వాటిని కుదిస్తూ రద్దు చేస్తూ జర్నలిస్టులను ఆందోళనకు గురి చేస్తుందన్నారు.పాత పద్దతినే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోని పక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.