*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేతవరకు ఆందోళనలు చేస్తాం….*
బాలానగర్ జనం సాక్షి 26: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే అంతవరకు ఆందోళనలు చేస్తాం. గురువారం కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ మండల కార్యాలయాల వద్ద జరిగిన ధర్నా . ఈ సందర్భంగా బాలానగర్ మండలాల తహసిల్దార్ గౌరీ వత్సల వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ జీవో 239ని వెంటనే రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డ్ లను మంజూరు చేయాలని కోరారు. ఈ జీవో వల్ల అర్హులైన జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్ లను పొందలేని పరిస్థితులు దాపురించాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు తగిన న్యాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిన అది ఇప్పటికీ నెరవేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులు ఇచ్చినప్పటికీ పని చేయడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య సదుపాయం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మండల కేంద్రాల వద్ద ఆందోళన చేపట్టా మని తెలిపారు. ఇదేవిధంగా అక్టోబర్ 4న ఆర్డిఓ కార్యాలయం వద్ద, 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపడతామని తెలిపారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకట్రావు, బంటు ప్రవీణ్, నరసింహారావు, రాకేష్, గోవర్ధన్ రెడ్డి, రమేష్, భూషణం, రాజు తదితరులు పాల్గొన్నారు.