జర్నలిస్టు కొల్పుల శ్రీనివాస్ కుటుంబానికి డిబిఎఫ్ ఆర్థిక సహయం.

దౌల్తాబాద్ అక్టోబర్ 23, జనం సాక్షి.
 ఇటివల రొడ్డు ప్రమాదంలో మరణించిన సినియర్ జర్నలిస్టు కొల్పుల శ్రీనివాస్ కుటుంబానికి డిబిఎఫ్ ఆర్థిక సహయాన్ని అందజేశారు . ఆదివారం నాడు తన స్వగ్రామం దొమ్మాటలో అతని కుటుంబాన్ని కలిసి డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ కుటుంబాన్ని ఓదార్చి 15000 వేల రూపాయల ఆర్థిక సహయాన్ని అందచేశారు.ఈ సందర్భంగా పి శంకర్ మాట్లాడుతూ కొల్పులశ్రీను కు విప్లవ ప్రజా ఉద్యమాలతో విడదియరాని సంబంధం వుందన్నారు జర్నలిస్టు గా తన కలం ద్వారా ప్రజా సమస్యలను వెలికితీశారని గుర్తు చేశారు. డిబిఎఫ్ విజ్ఞప్తి మేరకు ప్రజా ఉద్యమ కార్యకర్తలు,జర్నలిస్టులు,ఉద్యోగులు ఆర్ధిక సహయం అందించిన వారికి క్రతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్ట్ బండారు రాజు, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, ,డిబిఎఫ్ జిల్లాప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు,యండిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు పి కిరణ్,జర్నలిస్టలు పుట్ట రాజు,లింగుపల్లి మహేశ్ ,సంఘ సేవకులు ఉమర్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
Attachments area