జర్నలిస్ట్ పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడి..
ప్రశ్నించ్చినందుకు చంపుతానని బెదిరింపు.
ప్రజలకు సేవ చేయవల్సిన అధికారులే క్రూరంగా ప్రవర్తిస్తారా
అక్టోబర్ 10 (జనం సాక్షి)
గంగారం మండలం చింతగూడెం గ్రామపరిధిలో జరిగే పోడు భూముల సర్వేలో భాగంగా సోమవారం మనతెలంగాణ రిపోర్టర్ పల్లె సురేష్ పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ధరవత్ రమేష్ దాడి చేసారు.తనకు సంబందించిన భూమిని సర్వే జరుపలని తెలపగా అమర్యాదగా మాట్లాడుతూ, నేను ఒక రిపోర్టర్ ని సార్ అని చెప్పడంతో వెంటనే ఎవడైతే నాకేంటి అంటూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిపోర్టర్ పై ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ అంతటితో ఆగకుండా అతని చేతితో సదరూ రిపోర్టర్ చాతి మీద బలంగా కొట్టడంతో రిపోర్టర్ కింద పడడం జరిగింది. కింద పడిన వెంటనే అతడి బూట్ కాలుతో తన్ని అంతటితో ఆగకుండా గొడ్డలితో చంపుతానని మీదకి రాగ చింతగూడెం గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు.
ప్రశ్నించడమే పాపమా
అడిగితే చంపేస్తారా
ఎక్కడిది ఈ అధికారం
ఇది ప్రజాస్వామ్యమా లేక అప్రజాస్వామ్యమా*