*జలపాతాల వద్ద పర్యటకులు జాగ్రత్తగా ఉండాలి*
*పాండవుల గుట్టలను సందర్శించిన రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి*
రేగొండ (జనం సాక్షి)
రేగొండ మండలం పాండలగుట్టలో జాలువారుతున్న జలుపాతాలను చూడడానికి వస్తున్న పర్యాటకులు జాగ్రత్తలు వహించాలని రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని పాండవుల గుట్టలను రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. జలపాతాల వద్ద ఉన్న పర్యటకులకు పలు సూచనలు చేశారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షం నీరుతో బండలు పాకూరు బట్టి జారిపడే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. గుట్టల పైకి వెళ్లొద్దని సూచించారు. పర్యటకుల తాకడిని బట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.



