జలమయంగా మారిన సీతారామ కాలనీ
, జనంసాక్షి : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని శ్రీ సీతారామ కాలనీ గత నాలుగు రోజులు గా కురుస్తున్న వర్షాలకు జలమయం అయింది. మార్కెట్ కమిటీ నుండి వచ్చే మెయిన్ రోడ్డు డ్రైనేజీ లో.. చిన్న పైపులు వేసి పూడ్చడం వల్ల రెడ్డి చెరువు మత్తడి నీరు సీతారామ కాలనీ చుట్టూ ముట్టిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. దీనితో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నమని, ఇకనైనా ప్రమాదాన్ని గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.