జాతి సంపదను ప్రైవేటుకు అప్పగించేందుకే విద్యుత్ సవరణ బిల్లు.
రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు.
మిర్యాలగూడ. జనం సాక్షి.
విద్యుత్ను ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే కేంద్ర సర్కార్ పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని. ఈ బిల్లును సకల జనులు ముక్త కంఠంతో ఖండించాలని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు. పిలుపునిచ్చారు విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ మంగళవారం యాద్గారి పల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చట్టం అమలయితే రైతులకు 24 గంటల కరెంటు అంధదన్నారు. బ్యాంకులను ముంచుతున్న బడా వ్యాపారవేత్తలకు . రూ లక్షల కోట్ల మాఫీ చేసిన కేంద్రం ప్రజలకు తక్కువ చార్జీలతో కరెంటు అందిస్తున్న డిస్కంల నష్టాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు విద్యుత్ సంస్థలను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసేందుకు ప్రధానమంత్రి మోదీ కంకణం కట్టుకున్నారన్నారు రైతులు. అణగారిన వర్గాల ప్రజలు పొందుతున్న రాయితీలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు . కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి కార్పోరేట్ల కట్టబెట్టే ప్రయత్నాలను ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గోగుల యాదగిరి. సైదమ్మ. చింతమల రాములు. నక్క నగేష్. దేవులపల్లి దయాకర్. సతీష్. ప్రమీల. భారతమ్మ. కాసిం. వినయ్. రవీందర్ పాల్గొన్నారు