*జాతీయం నులి పురుగులు దినోత్సవం*
01నుండి 19 సంవత్సరాల వయస్సు పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి.
నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో,దిర్శించర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి, జెడ్పీటీసీ రాపోలు నరసయ్య ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అందరూ ఈ ఆల్బెండజోల్ మాత్రలు మింగడం వలన వారిలో రక్తహీనత రాకుండా మరియు పోషకాల గ్రాహ్యత మెరుగుపడడం,మరియు వారికి చదువులో ఏకాగ్రత నేర్చుకోగల సామర్థ్యం పెరుగుతుందనీ అన్నారు.ఈ కార్యక్రమంలో, వైద్యాధికారులు:డాక్టర్ ఎన్.ధర్మతేజ డాక్టర్ అరీప్,ప్రధానోపాధ్యాయులు,శ్రీని వాసరావు
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్:జి.లక్ష్మయ్య
ఉపాధ్యాయులు: ప్రభాకర్ రెడ్డి,నరసింహారావు,హెల్త్ సూపర్వైజర్: శ్యాంసుందర్ రెడ్డి, వైద్య సిబ్బంది, నర్సయ్య,సునిత,ఆశా కార్యకర్తలు,
గురువమ్మ,సునిత,తదితరులు పాల్గొన్నారు.
Attachments area