జాతీయత భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి…
-కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య….
జనగామ కలెక్టరేట్ ఆగస్టు9(జనం సాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో ప్రజలను ప్రభావింతులను చేస్తూ ఎక్కువగా పాల్గొనేలా చేసి జాతీయత భావాన్ని విస్తృతంగా ప్రతి ఒక్కరి చెంతకు తీసుకెళతామని జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఉన్నతాధికారులకు నివేదించారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ఏర్పాట్లను హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ 50వేల జాతీయ పతాకాలు జిల్లాకు వచ్చాయని, వాటిల్లో 10 వేల జాతీయ పతాకాలను పంపిణీ చేయడం జరిగిందని, మరో లక్ష జాతీయ పతాకాలు జిల్లాకు రానున్నాయన్నారు.జిల్లాలోని 5 సినిమా హాల్స్ లో గాంధీ చలన చిత్రం ప్రదర్షింప బడుతున్నదని సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులు తిలకిస్తున్నట్లు తెలిపారు.
ప్రణాళిక పరంగా నిర్వహించే కార్యక్రమాలను పక్కాగా చేపడతామన్నారు. అనంతరం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రతి రోజు నిర్వహించే కార్యక్రమాలపై అదేరోజు సాయంత్రం నివేదికలు అందించాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిసిపి సీతారాం, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జెడ్పి సీఈఓ విజయలక్ష్మి, డిఆర్డిఏ పిడి రాంరెడ్డి, ఆర్డిఓ మధుమోహన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.