జాతీయస్థాయి కరాటే పోటీలకు అందరూ ఆహ్వానితులే…

– జాతీయస్థాయి కరాటే పోటీలు జయప్రదం చేయండి.
– కరాటే ఆత్మ రక్షణకు దోహదపడుతుంది.
– కరాటే అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి.
ఊరుకొండ, ఆగస్టు 6 (జనం సాక్షి):
కల్వకుర్తి డివిజన్ కేంద్రంలోని
సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో విక్టరీ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యoలో ఆదివారం నిర్వహిస్తున్న జాతీయస్థాయి కరాటే పోటీలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని కరాటే మరియు కబడ్డీ అసోసియేషన్ నాగర్ కర్నూల్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఊరుకొండ మండలం ముచ్చర్లపలి గ్రామంలో తన నివాసంలో ఆయన మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్ లో జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయమని, జాతీయస్థాయి కరాటే పోటీలకు కరాటే మాస్టర్లు, కరాటే క్రీడాకారులు, అభిమానులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయస్థాయి క్రీడలను జయప్రదం చేయాలని కోరారు. కరాటే క్రీడలు అభ్యసించడం వల్ల ఆత్మరక్షణతో పాటు శారీరక దారుడ్యం, మానసిక ఉల్లాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఊరుకొండ మండల కేంద్రంతోపాటు ఊరుకొండ పేట గ్రామానికి చెందిన కరాటే విద్యార్థులు జాతీయస్థాయి కరాటే పోటీలలో పాల్గొనడం అభినందనీయమన్నారు. మండల విద్యార్థులు కరాటే క్రీడలో చక్కని నైపుణ్యాన్ని కనబరిచి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చి ఊరుకొండ మండలానికి, జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. జాతీయస్థాయి కరాటే క్రీడలకు మాజీ మంత్రి, జడ్చర్ల శాసనసభ్యులు చర్ల కోల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి శాసనసభ్యులు గుర్క జైపాల్ యాదవ్, జిల్లా ఎస్పీ కే.మనోహర్, అడిషనల్ ఎస్పి రామేశ్వర్, సినిమా హీరో సుమన్ తల్వార్, సీనియర్ కరాటే మాస్టర్లు ముఖ్య అతిథులుగా హాజరుతున్నారని తెలిపారు. అదే విధంగా గ్రాండ్ మాస్టర్ మల్లికార్జున్ గౌడ్, సదాశివుడు, శ్రీనివాస్, కిరణ్ నాయక్, ప్రసాద్ గౌడ్, రమేష్, వినోద్ కల్వకుర్తి ఖాదర్ టీం సభ్యులు ఖాదర్, ఉస్మాన్, ఆరిఫ్పుద్దీన్, జాతీయస్థాయిలో కరాటే క్రీడాకారులు తదితరులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు