జాతీయస్థాయి నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ పోటీలకు ఎంపికైన జెడ్పిహెచ్ఎస్ కోటగిరి విద్యార్థినీ.

 

 

 

 

 

 

 

కోటగిరి డిసెంబర్ 12 జనం సాక్షి:-30 వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ప్రాజెక్ట్ ప్రదర్శన హైదరాబాద్లోని నాట్కో పాఠశాల యందు డిసెంబర్ 10,11 తేదీలలో జరిగిన పోటీలలో కోటగిరి జడ్పిహెచ్ఎస్ కు చెందిన జి భాగ్య మౌనిక అద్భుత ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్.ఎం గాలప్ప తెలిపారు.ఆరోగ్యం,పోషణ,సంక్షేమం పెంపొందించడం అనే ఉప అంశం నుండి పిసిఓడి,పిసిఓఎస్ అనే అంశంపై భాగ్య మౌనిక ప్రాజెక్టును ఎంపిక చేసుకొని చక్కగా ప్రజెంటేషన్ చేశారు.ఈ సందర్భంగా భాగ్య మౌనికకు ఎన్సిఎస్సి జాయింట్ డైరెక్టర్ మదన్మోహన్ ప్రశంస పత్రాన్ని,జ్ఞపికను అందజేసే అభినందించారు.ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిఈఓ దుర్గా ప్రసాద్, సైన్స్ అధికారి గంగాకిషన్ ఆ చిన్నారికి అభినందనలు తెలియజేశారు.జనవరి 27న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగే జాతీయ స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలలో జి భాగ్యశ్రీ మౌనిక పాల్గొంటుందని హెచ్ఎం గాలప్పా తెలిపారు.ఈ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ విజయానికి కృషి చేసిన జీవశాస్త్రం టీచర్ కరుణ శ్రీ కి పాఠశాల మేనేజ్మెంట్, టీచర్స్,సిబ్బంది అభినందించారు.