జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా దాసరి కృష్ణ ఎంపిక
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 19(జనంసాక్షి) బహుజన సాహిత్య అకాడమీ అందించే బెస్ట్ ఫోటో & వీడియోగ్రాఫర్ నేషనల్ అవార్డుకు అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన దాసరి కృష్ణ (చిన్నా) ఎంపికయ్యారని అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.గ్రామీణ ప్రాంతంలోని పలు విచిత్ర సంఘటనలు, అరుదైన సన్నివేశాలను తన కెమెరాలో బంధించి, ప్రపంచానికి పరిచయం చేస్తున్న అద్భుతమైన ఫోటోగ్రాఫర్ కృష్ణ అని రాధాకృష్ణ కొనియాడారు. నవంబర్ 13న ఢిల్లీలో జరిగే బహుజన రచయితల, ఉద్యమకారుల 3వ జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణ అవార్డుకు ఎంపికైన సందర్భంగా హుస్నాబాద్ డివిజన్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు కుంటమల్ల రాజు తదితరులు హర్షం తెలిపారు.కాగా తన ప్రతిభను గుర్తించి జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణకు, రాష్ట్ర కమిటీ సభ్యులు ముక్కెర సంపత్ కుమార్ కు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.