జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ సరస్వతి

అశ్వరావుపేట, సెప్టెంబర్ 17 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమల కుంట గ్రామం లో శనివారం రోజున స్థానిక సర్పంచ్ సున్నం సరస్వతి గ్రామపంచాయతీ తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జుజ్జూరు రాంబాబు, కార్యదర్శి అనూష, అంగన్‌వాడి టీచర్లు వాణి, సత్యవతి,ఆశ కార్యకర్త లు నాగమణి లు సభ్యులు చెన్నారావు,, తెరాస పార్టీ మండల కార్యదర్శి జుజ్జురి వెంకన్న బాబు, గ్రామ తీపికలు వెంకట మహాలక్ష్మి వరలక్ష్మి, బొడ్డు సత్యనారాయణ, పల్లెల రామ లక్ష్మయ్య, బొల్లు కొండ చెన్నారావు, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.