జాతీయ జెండా కు అవమానం: చర్యకు ఐక్యవేదిక డిమాండ్

వనపర్తి: ఆగస్టు 21 (జనం సాక్షి) వనపర్తి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం బాధ్యతా రాహిత్యం వల్ల జాతీయ జెండాకు అవమానం జరిగిందని తక్షణం ఆయనను సస్పెండ్ చేయాలని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ఒక పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా వనపర్తి పట్టణ ప్రధాన రోడ్ల మధ్య స్తంభాలకు కట్టిన జాతీయ జెండాలను  ఆదివారం పరిశీలించామని తెలిపారు అయితే జెండాలకు ఒకవైపునే ప్రింట్ మరోవైపు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు జాతీయ జెండా కు ఒక నిర్దిష్టమైన కొలతలు, రంగులు ఉంటాయని అందుకు భిన్నంగా ఉండే జెండాలను వాడటం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు అటువంటిది ఒకపక్క ఖాళీగా ఉన్న జెండాలను వాడటం తప్పని మున్సిపల్ కమిషనర్ కు తెలియకపోవటం ఏమిటని ప్రశ్నించారు. చాలా విషయాల్లో రూల్స్ మాట్లాడే కమిషనర్ కు ఈ రూలు తెలియదా అంటూ మండిపడ్డారు.జాతీయ జెండాను అవమానించిన  మున్సిపల్ కమిషనర్ పై రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.
*కమిషనర్ వివరణ*
 ఈ విషయమై వనపర్తి మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరగా ఆయన స్పందించారు ఒకవైపు మాత్రమే ప్రింటు ఉన్న జెండాలను మొదటనే తాము గుర్తించామని  అయితే అటువంటి జెండాలే పైనుండి వనపర్తి ,మహబూబ్నగర్ మున్సిపాలిటీలకు సరఫరా అయ్యాయని తెలిపారు.ఇది గమనించి అనుమాన నివృత్తికి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ను కూడా అడిగామని  వివరణ ఇచ్చారు.