జాతీయ పథకాలను పంపిణీ చేసిన సర్పంచ్ ఉప సర్పంచ్

చందంపేట (జనం సాక్షి) ఆగస్టు 10
స్వతంత్ర సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర వజ్రోత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుందని మురుపునూతల గ్రామ సర్పంచ్ బొల్లు అలివేలు అన్నారు గ్రామ అధికారితో ప్రజలతో బుధవారం వార్డులో జాతీయ జెండాను ఇంటింటికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింస మార్గంలో మహాత్మా గాంధీ స్వాతంత్ర సంగ్రామం ముందుండి నడిపించిన మహానీయుడని ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు కత్తులతో కాకుండా అహింసాను ఆయుధంగా ఉపయోగించి గాంధీజీ నడిపించినటువంటి స్వాతంత్ర మా సంగ్రామం ఉద్యమం ఎన్నటికీ మర్చిపోలేనిదని వారు తెలిపారు స్వతంత్ర మహాసంగ్రామ స్వాతంత్ర సమరయోధుల చరిత్రను నేటి తరంలో పాటు రేపటి తరానికి తెలియజేప్పే విధంగా కార్యక్రమాలను రూపుదిద్దుకుంటున్నాయని సర్పంచ్ తెలిపారు వాడవాడలా ప్రతి ఇంటిపై జాతీయ పథకాన్ని ప్రతి ఒక్కరూ ఈనెల 22 వరకు ఎగరవేసుకోవాలని స్వాతంత్ర ఫలాల స్వేచ్ఛ స్వతంత్రాలను నలు దిశాల చాటి చెప్పాలని వారు తెలిపారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాను నాయక్ గ్రామ కార్యదర్శి కిరణ్ కుమార్ తో పాటు గ్రామ వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి శోభ మంగమ్మ ప్రజలు సాయిలు లక్ష్మారెడ్డి బక్కయ్య ఎల్లమ్మ లింగమ్మ రవణమ్మ కౌసల్య కళావతమ్మ ముత్తయ్య పాల్గొనడం జరిగింది
 

తాజావార్తలు