జాతీయ రహదారిపై నిరసన చేపట్టిన విద్యార్థులు
అబ్దుల్లాపూర్‌మెంట్: సంజయ్‌గాంధీ స్మారక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అంబర్‌పేటకు చెందిన అజాజ్‌అహ్మద్ నిన్న జరిగిన పేలుళ్లలో మృతి చెందడంతో కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు నివాళులు అర్పించారు. పేలుళ్లకు నిరసనగా కళాశాల ముందు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు.
అదే విధంగా బాంబు పేలుళ్ల ఘటనకు నిరసనగా భాజపా ఆధ్యర్యంలో పెద్దఅంబర్‌పేటలో నిరసన ప్రదర్శనలు చేపట్టి ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.