జాతీయ సమైక్యత సమగ్రతను చాటిన భారీ ర్యాలీ.
చరిత్రను గుర్తుకు తెచ్చిన సాంస్కృతిక ఆటపాటలు.
విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్ సంస్థాన రాజ్యాన్ని భారతదేశంలో కలిపిన రోజు సెప్టెంబర్ 17 అని వక్తల ప్రసంగం.
ములుగు బ్యూరో,సెప్టెంబర్16(జనం సాక్షి):-
రజాకార్ల పాలన నుండి స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయినందున శుక్రవారం రోజున నుంచి మూడు రోజులపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు
మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత అన్నారు.శుక్రవారం జాతీయ సమైక్యత వజ్రోత్సవాల తొలిరోజు ములుగు జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ నుండి నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గట్టమ్మ వరకు భారీ సంఖ్యలో విద్యార్థులు, యువతి, యువకులు, అధికారులు, పోలీస్ శాఖ, ప్రజలు తరలిరాగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి పెట్రోల్ బంక్ వరకు జాతీయ పతాకం చేతపట్టి భారత్ మాతాకీ జై, జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ సాగింది. ర్యాలీని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, ములుగు శాసనసభ్యులు ధనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, ఎస్పి సంగ్రామ్ సింగ్ జి పాటిల్,ఓఎస్డి గౌస్ ఆలం ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయ పతాకాలతో డిజె పాటలు న్యుత్యాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతంలో విలీనం కాలేదని ఎందరో నిజాం వ్యతిరేక పోరాట యోధులు చేసిన పోరాటాల ఫలితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో మనకు రజాకారుల నుండి విముక్తి లభించినందున రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు జాతీయ సమైక్యత దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ములుగు ఎమ్మెల్యే అనసూయ సీతక్క మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని ప్రజలు అందరూ సమానమేనని జాతీయ సమైక్యత సమగ్రత సౌభ్రాతృత్వం స్వేచ్ఛ కోసం స్వాతంత్ర పోరాటాలు గాంధీ నేతృత్వంలో జరిగాయి అన్నారు. తెలంగాణాలో మూడు రోజులపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఒక పండుగ వాతావరణం లో నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఎందరో మహనీయులు పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించాక రజాకారుల నుండి విముక్తి మనకు లభించినందున సమైక్యత స్పూర్తి పొందే విధంగా పిల్లల భవిషత్తుకు దోహద పడతాయని ఆమె అన్నారు. రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితం వల్ల నేడు మనకు స్వాతంత్రం లభించిందని, రజాకారుల నుండి విముక్తి లభించిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులపాటు జాతీయ సమైక్యత సంబరాలు నిర్వహిస్తున్నందున రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని సంస్థానాలు విలీనం కావడానికి ఒప్పుకుంటే జమ్మూ కాశ్మీర్, జొనా గార్డ్స్, హైదరాబాద్ మూడు సంస్తనాలు ఒప్పుకోలేదని, హైదరాబాద్ ప్రత్యెక దేశంగా ఉండాలని సైనిక చర్యల ద్వారా సెప్టెంబర్ 17న నిజాం రజాకారుల నుండి మనకు విముక్తి లభించిందని ఆయన తెలిపారు.
అనంతరం తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారులచే తెలంగాణా జాతీయ వజ్రోత్సవాల పై ధూమ్ ధాం కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కోలాహాలంగా సాగినాయి. అతిథులు విద్యార్థుల న్యుత్యాలను తిలకించారు.విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వై వి గణేష్,డిఆర్ఓ కే రమాదేవి,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, జెడ్పి వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, జెడ్పిటిసిలు తుమ్మల హరిబాబు,గై రుద్రమదేవి, సకినాల భవాని, పాయం రమణ, ములుగు ఎంపీపీలు శ్రీదేవి, సూడి శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ మైంబర్ వలియా బి,రియాజ్ మీర్జా,జిల్లా వివిధ శాఖల అధికారులు జిల్లా వైద్యాధికారి అప్పయ్య,జెడ్పి సీఈవో ప్రసన్నారని డిఆర్డిఓ నాగ పద్మజ, డిఇఓ జిపానిని, జిల్లా అధికారులు, తహసిల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్రీనివాస్,ఎంపిడిఓ లు,పిఎసిఎస్ చైర్మన్ లు, ఎంపీటీసీలు,సర్పంచులు, అన్ని శాఖల అధికారులు,విద్యార్థులు,మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.