జానా, డీకే అరుణ, షబ్బీర్‌లకు షాక్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సీనియర్లకు షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేతలైన జానారెడ్డి, డీకే అరుణ, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, సర్వే సత్యనారాయణ తెరాస అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. నాగార్జున సాగర్‌లో నోముల నర్సింహయ్య చేతిలో ప్రతిపక్ష నేత జానారెడ్డి పరాజయం చవిచూశారు. గద్వాలలో తెరాస అభ్యర్థి చేతిలో డీకే అరుణ, వనపర్తిలో నిరంజన్ రెడ్డి చేతిలో చిన్నారెడ్డి, కామారెడ్డిలో గంప గోవర్ధన్ చేతిలో షబ్బీర్ అలీ, కంటోన్మెంట్లో సాయన్న చేతిలో సర్వే సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. ముఖ్యనేతలతో పాటు చాలా చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పరాజయం బాటలో ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు డీలా పడిపోయాయి.